Max Movie Teaser | ఈగ (Eega) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). 2022లో విక్రాంత్ రోన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత సుదీప్ చేస్తున్న తాజా చిత్రం మాక్స్ (Max). విజయ్ కార్తికేయన్ (Vijay Karthikeyan) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నేడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు ఈ సందర్భంగా మాక్స్ మూవీ నుంచి మేకర్స్ సాలీడ్ అప్డేట్ ఇచ్చారు.
కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. “నార్త్ డైరెక్షన్ నుంచి 10 బండ్లలో హెవీ వెపన్స్‌తో వస్తున్నారు సర్. పడమర నుంచి 12, తూర్పు నుంచి 13. ఇప్పుడు రాబోయే వాళ్ళు అగ్ని పర్వతం నుంచి తప్పించుకోవచ్చు. భూకంపం నుంచి తప్పించుకోవచ్చు.. తుఫాన్ నుంచి తప్పించుకోవచ్చు. సునామీ నుంచి కూడా తప్పించుకోవచ్చు కానీ వీడితో పెట్టుకుంటే సావు లేని వరంతో పుట్టినోడు కూడా చచ్చిపోతాడు” అంటూ టీజర్ సాగింది.
కబాలి, కర్ణన్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కలైపులి ఎస్ థాను వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జానర్లో రానున్న ఈ చిత్రంలో కాంతార ఫేం సప్తమి గౌడ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డార్లింగ్ కృష్ణ, నవీన్ శంకర్, వాసుకి వైభవ్, అనూప్ భండారి, వినయ్ రాజ్‌కుమార్, డాలి ధనంజయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Happy to make this day more special for Baadshah @KicchaSudeep, and here is the birthday treat for all of you! 🎉
The Demon 😈 has a name now #Max 💥
Title Teaser out now ▶️ https://t.co/cJfc0UvPhj@theVcreations #Kichcha46 @Kichchacreatiin @saregamasouth @TSrirammt… pic.twitter.com/fCyozhPu2Y
— Ramesh Bala (@rameshlaus) September 2, 2023