Kiccha Sudeep Mother | కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ (86) ఆదివారం కన్నుమూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని సుదీప్ కుటుంబ సభ్యులు తెలుపుతూ.. సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7 గంటల ప్రాంతంలో మరణించినట్లు నిర్ధారించారు. ఇక సుదీప్ తల్లి మరణించిందన్న వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అమెకు సంతాపం తెలుపుతున్నారు.