కన్నడ అగ్రహీరో ‘కిచ్చా’ సుదీప్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్, శరత్ లోహితస్య కీలక పాత్రధారులు. విజయ్ కార్తికేయ దర్శకుడు. కలైపులి థాను నిర్మాత. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘మా పొలిటికల్ కెరీర్‌కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్..’ అనే వాయిస్ ఓవర్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
ట్రైలర్లో శరత్ లోహితస్య పొలిటికల్ లీడర్లా కనిపించారు. అలాగే సునీల్ విలన్‌గా నటిస్తున్నట్టు ట్రైలర్ చెబుతున్నది. ట్రైలర్ అంతా బైకర్ గ్యాంగ్స్, విలన్స్, పోలీస్.. ఒక టెన్షన్ వాతావరణంలో కనిపించింది. ‘చావు ఎదురొచ్చినా సరే మా అబ్బాయి ఒంటరిగా నిలబడి పోరాడతాడు..’ అని హీరో తల్లి చెప్పే డైలాగ్‌తో కిచ్చా సుదీప్ ఎంట్రీ మాస్ మెచ్చేలా ఉంది.
ఆయన యాక్షన్ ప్యాక్ట్ పవర్ఫుల్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. ‘మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్‌గా ఉండాలి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుథ్ భట్ తదితరులు ఇతరపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: ఆశ్లేషా, కెమెరా: శేఖర్ చంద్ర, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: వి.క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్.