Kiara Advani Don 3 | బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో డాన్ 3 ఒకటి. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించబోతుండగా.. రణవీర్ సింగ్ డాన్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా ‘డాన్’ ఫ్రాంచైజీలో మూడవ భాగం, ఇంతకుముందు షారుఖ్ ఖాన్ నటించిన ‘డాన్’ (2006), ‘డాన్ 2’ (2011) చిత్రాలకు కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానీని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి కియారా తప్పుకున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.
కియారా తల్లి కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో 2023లో కియారాకు వివాహం కాగా.. తాజాగా తాము పేరెంట్స్ కాబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ప్రెగ్నెన్సీ కారణంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి కియారా తప్పుకున్నట్లు తెలిసింది. దీంతో డాన్ 3లో కొత్త హీరోయిన్ కోసం మళ్లీ వెతకడం మొదలుపెట్టారు చిత్రనిర్మాతలు. మరోవైపు డాన్ 3ని వదులుకున్న కియారా తన ఇతర ప్రాజెక్టులైన వార్ 2(హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్), టాక్సిక్(కేజీఎఫ్ యష్) చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉంది. ఈ సినిమాల అనంతరం పూర్తిగా విరామం తీసుకుని అమ్మతనాన్ని ఆస్వాదించాలని చూస్తున్నట్లు సమాచారం.