Saraayah Malhotra | బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులుగా మారిన తర్వాత తొలిసారిగా తమ కూతురి ఫొటోను పంచుకున్నారు. అంతేకాకుండా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ ముద్దుల కూతురి పేరును కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ జంట తమ కుమార్తెకు సారాయహ్ మల్హోత్రా (Saraayah Malhotra) అని నామకరణం చేసినట్లు ప్రకటించారు. కియారా మరియు సిద్ధార్థ్ ఇద్దరూ తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కూతురి కాళ్లని పట్టుకుని ఉన్న ఒక మధురమైన ఫొటోను షేర్ చేశారు. ”మా ప్రార్థనల నుంచి… మా చేతుల్లోకి… మా దివ్య ఆశీర్వాదం, మా యువరాణి… సారాయహ్ మల్హోత్రా” అంటూ ఈ పోస్ట్ కిందా క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ క్యూట్ బేబీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.