Kiara Advani | ‘వివాహాం తరువాత నటించడం ఎందుకు అంటూ కొందరూ నాపై విమర్శలు కురిపించారు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. అయితే ప్రేక్షకులు మాత్రం నా విషయంలో ఎంతో ప్రేమ చూపి నా సినిమాలు ఆదరించారు. అది నాకు ఎంతో ధైర్యానిచ్చింది’ అన్నారు నటి కియారా అద్వాని. ఇటీవల ‘సత్యప్రేమ్ కీ కథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడింది. ‘నాపై వచ్చిన విమర్శలపై, ట్రోలింగ్ విషయంలో నా భర్త సిద్దార్థ్ మల్హోత్ర ఎప్పుడూ తోడు వుండేవాడు.
ఆయన ఎంతో ధైర్యం చెప్పేవాడు. నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ల మాటలను ఎప్పుడూ పట్టించుకోకుండా మన పని మనం నిజాయితీగా చేసుకుంటూ పోవాలని చెప్పేవాడు. విమర్శల గురించి లోతుగా ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా ఎక్కువగా వస్తాయని ఆయన చెప్పేవారు’అని చెప్పుకొచ్చింది కియారా అద్వాణి. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’లో కియారా హీరోయిన్గా నటిస్తోంది.