Kiara Advani | బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ అంటూ సందడి చేసింది. ఆ తరువాత మళ్లీ బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల గేమ్ ఛేంజర్ చిత్రంతో తెలుగులో పలకరించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందింది. దీంతో రామ్ చరణ్ కియారా కాంబోకి ఫెయిల్యూర్ కాంబో అనే ముద్ర పడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక కియారా సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి జంట చూడ ముచ్చటగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లైన కొద్ది రోజులకి ఈ జంట గుడ్ న్యూస్ చెప్పారు. సిద్దార్థ్ మల్హోత్ర, కియారా అద్వానీలు తమకు పండండి బిడ్డ పుట్టబోతోన్నారని చిట్టి సాక్సులను షేర్ చేశారు. ఇక ఇలా గుడ్ న్యూస్ చెప్పారో లేదో.. నెటిజన్లు, సెలెబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత, రకుల్, రియా కపూర్, ఇషాన్ కట్టార్, హ్యూమా ఖురేషి వంటి వారు కూడా విషెస్ తెలియజేశారు. ఫిబ్రవరి 28వ తేదీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వేదికగా ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు. రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో 2023 ఫిబ్రవరి 7వ తేదీ వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
కియారా అద్వాని త్వరలో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుండగా, ఆమెకి కవలలు పుట్టబోతున్నారని అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో తనకి కావల్సింది ఇద్దరు ఆరోగ్యవంతులైన పిల్లలు, ఒక అమ్మాయి, అబ్బాయి అని చెప్పుకురావడంతో దీనిపై నెటిజన్స్ కియారాకి కవలలు పుట్టబోతున్నారని చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజులు కియారా తన అభిమానులకి ఎలాంటి గుడ్ న్యూస్ అందిస్తుందనేది.