Khushi Movie Collections | ఎట్టకేలకు విజయ్ దేవరకొండ హిట్టు కొట్టేశాడు. దాదాపు ఐదేళ్ళుగా వరుస వైఫల్యాలతో నిరాశలో ఉన్న రౌడీ స్టార్‌కు ఖుషీ మంచి బూస్టప్ ఇచ్చింది. ముఖ్యంగా లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత విజయ్‌కు సాలిడ్ హిట్టు పడింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ముందు నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి హైప్ నెలకొంది. దానికి తగ్గట్లే పాటలు, ట్రైలర్ ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. దానికి తగ్గట్లే సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆహా ఓహో అనే రేంజ్లో లేదు కానీ.. ఒక్కసారి చూసేయోచ్చు అనే విధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రావడంతో ఆడియెన్స్ థియేటర్లకు పరగులు పెడుతున్నారు. పైగా తెలుగునాట ఈ సినిమా తప్పితే మరో ఆప్షన్ కూడా కనిపించడం లేదు. దాంతో తొలిరోజు రూ.30 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇక రెండో రోజు కూడా రూ.20 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించి.. రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో హాఫ్ సెంచరీ కొట్టాల్సి ఉంటుంది. ఆదివారం బుకింగ్స్ కూడా భారీ రేంజ్‌లోనే ఉన్నాయి. సోమవారం నుంచి ఈ సినిమాకు అసలైన పరీక్ష మొదలు కానుంది.
ఏమున్న వచ్చే వారంలోపే ఈ సినిమా ఎంత రాబడితే అంత మంచిది. ఎందుకుంటే వచ్చే వారం జవాన్‌తో పాటు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాంతో ఎంత లేదన్నా సగం థియేటర్లు వాటికి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆపై వాటికి పాజిటీవ్ టాక్ వస్తే.. ఖుషీ సినిమా డల్ అవడం పక్కా. ఈ లోపే ఖుషీ బ్రేక్ ఈవెన్ మార్కును దాటాల్సి ఉంటుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా సమంత నటించింది.
#BlockbusterKushi smashes 51 CRORES in 2 days worldwide ❤️
Families showering all their love on the BLOCKBUSTER FAMILY ENTERTAINER ❤🔥#Kushi is setting the ticket windows on fire in international and local circuits 💫🔥
– https://t.co/16jRp6UqHu@TheDeverakonda… pic.twitter.com/WrSdHwiGgP— Mythri Movie Makers (@MythriOfficial) September 3, 2023