Khushi Movie First Single | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను లైగర్ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు రెండేళ్ల పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. యునానిమస్‌గా ఈ సినిమా తిరస్కారానికి గురి కావడంతో విజయ్ సైతం సైలెంట్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
నా రోజా నువ్వే అంటూ సాగే ఈ మెలోడియస్ పాట ప్రోమో ఆకట్టుకుంటుంది. జస్ట్ మ్యూజిక్‌తో ప్రోమో కట్ చేశారు. ప్రోమోలో సమంత నమాజ్ చేస్తున్నట్లు చూపించారు. హేషమ్ అబ్దుల్ వాహద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. కాశ్మీర్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్‌కు జోడీగా సమంత నటిస్తుంది. నిజానికి ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. అంతేకాకుండా ముందుగా ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Here’s the lovely glimpse of #Kushi First Single ❤️
Full song out on May 9th 🎧❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi @saregamasouth pic.twitter.com/XDWXepNYvd
— Mythri Movie Makers (@MythriOfficial) May 7, 2023