Khushbu Selfie | ఒకే ఫ్రేమ్‌లో రంభ, ఖుష్బూ..స్పెషల్ ఏంటంటే..!
అలనాటి తారలు ఖుష్బూ (Khushbu Sundar), రంభ (Rambha) ఒక్క చోట చేరితో ఎలా ఉంటుంది. ఆ ఫొటోనే ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలను అందం, అభినయంతో షేక్ చేసిన తారల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు అలనాటి తారలు ఖుష్బూ (Khushbu Sundar), రంభ (Rambha). వీరిలో ఖుష్బూ యాక్టింగ్ కొనసాగిస్తుండగా..రంభ మాత్రం ఫ్యామిలీ లైఫ్‌తో బిజీగా అయిపోయింది. ఈ ఇద్దరూ ఒక్క చోట చేరితో ఎలా ఉంటుంది. ఆ ఫొటోనే ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ వీరిద్దరు కలవడానికి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా..? క్యాజువల్ మీట్లో భాగంగానే ఇలా ఒక్క చోట చేరినట్టు తాజా స్టిల్స్ తో అర్థమవుతోంది. చెన్నైలోని నివాసంలో రంభ , ఆమె పిల్లలను కలిసింది ఖుష్బూ.
రుచికరమైన బిర్యానీ (delicious Biryani) వంటకాలను ఆరగించారు. ఈ ఇద్దరు నటీమణులు తమ పాత జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకున్నారు. రంభతో దిగిన సెల్ఫీని, ఆమె పిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో మెరిసింది ఖుష్బూ. రంభ పెళ్లయిన తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. ఈ బ్యూటీ సినిమాల్లో కనిపించక చాలా కాలమే అవుతుంది.
ఈ ఏడాది మహాసముద్రం సినిమాలో రంభ పేరుతో ఓ పాట కూడా రాగా..నెట్టింట్లో ట్రెండింగ్‌గా నిలిచింది. రంభ మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

