80స్లో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల భామల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది ఖుష్బూ (Khusbhu Sundar) . తన అందం, అభినయంతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ సీనియర్ నటి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పొలిటికల్ కూడా ఫుల్ బిజీగా ఉంది. కాగా గ్లామరస్ ఇండస్ట్రీలో ఖుష్బూ స్థానాన్ని తాను భర్తీ చేస్తానంటూ ముందుకొచ్చింది అవంతిక (Avantika Sundar). ఇంతకీ ఈ భామ ఎవరనే కదా మీ డౌటు. ఖుష్బూ సుందర్ చిన్న కూతురు.
ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్న అవంతిక రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేసింది. గ్రీన్ కలర్ మినీ గౌన్‌లో బాడీ టాటూలతో మల్టీకలర్ హెయిర్‌తో అందాలు ఆరబోస్తూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతుందన్న వార్తలకు న్టెటింట పోస్ట్ చేసిన అవంతిక గ్లామర్ ఫొటోలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఖుష్బూ కూడా గ్లామరస్ పాత్రలతో సినీ ఇండస్ట్రీలో లీడింగ్ పొజిషన్లో కొనసాగిన విషయం తెలిసిందే. అవంతిక కూడా తల్లి బాటలో పయనిస్తానన్నట్టుగా గ్లామర్ డోస్ శాంపిల్‌ను పరిచయం చేస్తూ.. ఖుష్బూకు కార్బన్ కాపీలా ఉందంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు, నెటిజన్లు. మరి అవంతిక ఇండస్ట్రీ ఎంట్రీ గురించి రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.
Avantika Sundar1
Avantika Sundar2