కరోనా వలన చాలా సినిమాలు ఓటీటీలోకి విడుదల కాగా, ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణగడంతో అన్ని సినిమాలు థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. క్రాక్ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి చిత్రం కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
విభిన్న యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. అర్జున్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమైంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు . ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సాతో పాటు దేవిశ్రీ తమ్ముడు సాగర్ మాటలు రాస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు దీన్ని నిర్మించారు.
విశేషం ఏమంటే… ఫిబ్రవరి 11న అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అదే రోజున ఖిలాడీ కూడా రాబోతుంది. అంటే ‘మేజర్’,‘ఖిలాడీ’ మధ్య గట్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.