Shivoham Movie | బెల్లకొండ శ్రీనివాస్‌తో రాక్షసుడు సినిమా తీసి బంపర్ హిట్టు కొట్టిన రవి వర్మ.. రవితేజతో ఖిలాడీ సినిమా తీసి డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. ఖిలాడీ ఫలితం రవి వర్మను బాగానే దెబ్బ తీసింది. సినిమా రిలీజై ఏడాదినర్ధం అయిన ఇంకో సినిమాను పట్టాలెక్కించలేడు. ఆ మధ్య రాక్షసుడు సినిమాకు సీక్వెల్ అంటూ ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా వదలాడు. కానీ ఇప్పటివరకు దాని ఆచూకి లేదు. అసలు ఆ ప్రాజెక్ట్ ఉందా క్యాన్సిల్ అయిందన్న క్లారిటీ కూడా లేదు. కాగా తాజాగా ఈ దర్శకుడు తన కొత్త సినిమాను ప్రకటించాడు.
శివోహం అంటూ ఓ భారీ కట్టుదిట్టమైన గొలుసు, త్రిషూలంతో బంధించి ఉన్న ఓ ట్రెజర్‌ను చూపించారు. ఈ సినిమా పోస్టర్ కాస్త డిఫరెంట్‌గా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. పోస్టర్ చూస్తుంటే ఇదొక ట్రెజర్ హంట్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలా అనిపిస్తుంది. అంతేకాకుండా దెయ్యం, దేవుడి రిఫరెన్స్‌ను ఈ సినిమాలో కోర్ పాయింట్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఖిలాడీ తర్వాత ఇలాంటి సినిమా రవి వర్మ నుంచి వస్తుందని ఎవ్వరూ ఊహించలేరు. ఖర్చుకు వెనకాడని స్టూడీయో గ్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
కాగా హీరో పేరు మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓ టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరో ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ హీరో ఇప్పటివరకు ఇలాంటి జానర్‌ను టచ్ చేయలేదట. మరి ఆ హీరో ఎవరా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
On the occasion of our @DirRameshVarma’s Birthday, We Proudly announce our next.
Unlocking a Mysterious Saga.. A VICIOUS DEVIL's battle for a SECRET TREASURE.. #Sivoham 🔥
Get Ready To Witness A Spectacular Visual Extravaganza with Magnificent Cast & Crew💥
@kegvraja… pic.twitter.com/pawqbXS1QY— Studio Green (@StudioGreen2) August 22, 2023