Khaleja | సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా చిత్రం 2010లో విడుదలై కమర్షియల్‌గా హిట్ కాలేకపోయింది. అయితే ఈ మూవీ ఒక కల్ట్ క్లాసిక్ గా మారింది అని చెప్పవచ్చు. థియేటర్లో హిట్ కాకపోయిన ఈ చిత్రం టీవీలో వస్తే మాత్రం మంచి టీఆర్పీని సంపాదించుకుంది. ఎప్పుడు రిలీజ్ అయిన కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ మూవీని మే 30న 4కే రీరిలీజ్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ రీ రిలీజ్‌కి సంబంధించిన క్రేజ్ ఊహించిన దానికన్నా ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ మూవీ బుకింగ్స్ కొన్ని గంటల కిందట ఓపెన్ కాగా, ఈ చిత్రం ఇప్పటివరకు వచ్చిన తెలుగు రీ రిలీజ్ సినిమాల బుకింగ్స్ బ్రేక్ చేసింది. హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు విడుదలైన అన్ని రీ రిలీజ్ సినిమాల్లో ఖలేజా 4K అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించింది. రిలీజ్‌కి మరో మూడు రోజుల సమయం ఉన్నా కూడా ఈ మూవీ సిటీలో రూ.1 కోటి గ్రాస్‌ను దాటి పోయింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ కలెక్షన్స్ రిలీజ్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది . ఇప్పటివరకు హైదరాబాద్‌లో 2025లో రీ రిలీజ్ అయిన సినిమాల్లో టాప్-5 అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లిస్ట్ పరిశీలిస్తే.. మొదటి స్థానంలో ఖలేజా – రూ.1 కోటి తో ఉండగా రెండో స్థానంలో ఆర్య 2 – రూ.88 లక్షలు ఉంది.
మూడో స్థానంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC) 4K – రూ.70 లక్షలు , నాలుగో స్థానంలో సలార్ – రూ.65 లక్షలు ,ఐదో స్థానంలో వర్షం 4K – రూ.47 లక్షలుగా ఉంది. ఈ లిస్ట్‌లో ఖలేజా టాప్‌లో నిలవడంతో ఈ సినిమా విడుదల రోజు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సెకండ్ హ్యాండ్ జనరేషన్ ఖలేజాను థియేటర్లో చూడాలనుకుంటే మాత్రం మూవీకి భారీ కలెక్షన్స్ రావడం ఖాయం. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటించింది. సునీల్, ఆలీ తమ కామెడీతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు.