Khaleja | ఈ మధ్య రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక సందర్భాన్ని పునస్కరించుకొని పలువురు హీరోల చిత్రాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీగా నిలిచిన ఖలేజా చిత్రం ఇటీవల రీరిలీజ్ కాగా, ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఖలేజా మూవీని రీ రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో ఆడియన్స్, ఫ్యాన్స్ మేకర్స్ ను కోరుతున్న నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా.. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. దీంతో రెస్పాన్స్ ఊహించిన రెస్పాన్స్ వస్తుంది.
థియేటర్లో ఓ రేంజ్లో సందడి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్నీ సెంటర్స్ లో ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా వసూళ్లు పరంగా చూస్తే.. పెద్ద సంచలనం సృష్టించేలా ఉంది.. కచ్చితంగా రూ.10 కోట్లను రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనాల వేయగా, అది నిజమయ్యేలా కనిపిస్తుంది. తొలి రోజే ఈ చిత్రానికి రూ.6.5లక్షల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఇండియా మొత్తంలో 1531 షోలు (గురువారం రాత్రి+ శుక్రవారం) పడగా.. రూ.6.50 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో నార్త్ అమెరికాలో 72 వేల డాలర్లు ఖలేజా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇప్పుడు $100K మార్క్ వైపు దూసుకుపోతుంది. అక్కడ గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేసింది ఖలేజా. అప్పుడు గబ్బర్ సింగ్ $66,000 వసూలు చేయగా.. ఇప్పుడు అంతకు మించి వసూళ్లు రాబడుతుంది. రీ రిలీజ్ ట్రెండ్ లో బిజినెస్ మ్యాన్, మురారి, గబ్బర్ సింగ్ తర్వాత రూ.5 కోట్లకుపైగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఖలేజా నిలవడం విశేషం. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో మహేష్ బాబు క్రేజ్ హాలీవుడ్‌కి చేరుకుంటుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.