ఖాకీ-ద బీహార్ ఛాప్టర్ (వెబ్ సిరీస్)
నెట్‌ఫ్లిక్స్: నవంబర్ 25
తారాగణం: కరణ్ థాకర్, అవినాశ్ తివారి,అభిమన్యు సింగ్, రవికిషన్, ఆశుతోష్ రాణా
దర్శకత్వం: నీరజ్‌పాండే
బీహార్ మాఫియా, నేర సామ్రాజ్యం నేపథ్యంలో ఏడు భాగాలుగా నిర్మించిన ‘ఖాకీ’ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్నది. ఐపీఎస్ అధికారి అమిత్లోధా రాసిన ‘బీహార్ డైరీస్’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను చిత్రీకరించారు. విధి నిర్వహణలో స్వీయ అనుభవాల్ని పొందుపరుస్తూ అమిత్ ఈ పుస్తకం రాశారు. అమిత్లోధా పాత్రలో కరణ్ థాకర్ నటించాడు. బీహార్‌లో మాఫియా ఆగడాల నేపథ్యంగా గంగాజల్, అప హరణ్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్ చిత్రాలు సంచలనం సృష్టించాయి.
‘ఖాకీ’ సబ్జెక్ట్ కూడా ఇంచుమించు ఇదే! మాజీ ఐపీఎస్ కోణంలో కథ, కథనాల్ని నడిపించడం ఆసక్తిని పెంచుతుంది. పేదరికం వల్ల బీహార్ గ్రామీణ యువత నేర సామ్రాజ్యం వైపు ఆకర్షితులు కావడం, రాజకీయ, మాఫియా శక్తుల చేతుల్లో వారు ఏ విధంగా పావులుగా మారుతున్నారనేది యథార్థ కోణంలో చర్చిస్తూ సిరీస్ సాగింది. నీరజ్‌పాండే దర్శకత్వం వహించిన ‘ఖాకీ’ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.