తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కూలీ. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తున్నాడు లోకేష్. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘ఖైదీ 2’ సినిమాపై స్పందించాడు.
కూలీ సినిమా విడుదలైన వెంటనే ఖైదీ 2 సినిమా పట్టాలెక్కుతుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లోని ఒక భాగమని, మొదటి సినిమా ‘ఖైదీ’కి ఇది సీక్వెల్ అని ఆయన అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 35 పేజీల వరకు తాను స్టోరీ రాసుకున్నానని.. స్టోరీ కూడా మంచిగా వచ్చిందని తెలిపాడు. కార్తీ కథానాయకుడిగా నటించిన ఖైదీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనికి కొనసాగింపుగా ‘ఖైదీ 2’ను తెరకెక్కించబోతున్నాడు లోకేష్.
“#Kaithi climax was open ended with Dilli Character. After LCU happened, I took characters from Vikram & LEO🦂. I have written 30-35 pages of story for Kaithi2 & it got developed very interestingly❤️🔥. After #Coolie release, will start #Kaithi2✅”
– #Lokesh pic.twitter.com/zqJojA8FrG— AmuthaBharathi (@CinemaWithAB) August 5, 2025