కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు కేజీఎఫ్ చాఫ్టర్ 2 (kgf chapter 2). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. కన్నడతోపాటు పలు భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇవాళ కేజీఎఫ్ చిత్రయూనిట్ కర్ణాటకలోని కొల్లూర్ శ్రీ మూకాంబికా, అనెగుడ్డె శ్రీ వినాయక టెంపుల్‌ను సందర్శించింది. యశ్, ప్రశాంత్ నీల్‌తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవీనా టండన్, శ్రీ నిధి శెట్టి, రావు రమేశ్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యశ్ లీడ్ రోల్ లో నటించిన కేజీఎఫ్ ఏ స్థాయిలో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్టు సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్ చాఫ్టర్ 2 కూడా త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రాబోతుండడంతో మూవీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.