Robinhood | ‘రొమాంటిక్’ ‘రంగ రంగ వైభవంగా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కేతికా శర్మ. తెలుగులో ఈ భామ మంచి బ్రేక్కోసం ఎదురుచూస్తున్నది. తాజాగా ఈ సొగసరి నితిన్ ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని మూడో గీతాన్ని ఈ నెల 10న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ పాటలో కేతికా శర్మ అల్ట్రా గ్లామరస్ అవతార్‌లో కనిపిస్తుందని, జీవీ ప్రకాష్ కుమార్ బాణీ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్గా ‘రాబిన్‌హుడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని, మ్యూజికల్‌గా ఈ సినిమా అందరిని అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.