Ketika Sharma | కాలం కలిసొస్తే చాలు.. అవకాశాలు వాటంతట అవే నడుచుకుంటూ వచ్చేస్తాయి. ఇక్కడ సక్సెస్‌లతో పనిలేదు. అదృష్టం ఉంటేచాలు. ‘రొమాంటిక్’ బ్యూటీ కేతికా శర్మనే తీసుకోండి.. కెరీర్ మొదలైనప్పట్నుంచి ఒక్కటంటే ఒక్క హిట్టుకూడా లేదు. కానీ అవకాశాలు మాత్రం కుప్పలుతెప్పలు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం కేతిక పెద్ద స్టార్.
ఆమె ఫాలోవర్స్ లక్షల్లో ఉంటారంటే అతిశయోక్తికాదు. ఇటీవల తన ఇన్‌స్టాలో లైవ్ మీటింగ్ నిర్వహించిన ఈ అందాలబొమ్మను తన సక్సెస్‌ల గురించి అడిగి ఓ అభిమాని ఇరిటేట్ చేశారు. దానికి ఆమె స్పందిస్తూ ‘నా సినిమాలు ఆడకపోతే నాదెలా బాధ్యతవుతుంది. నావరకూ నేను ఫుల్ ఎఫర్ట్స్ పెడతాను. నేను నటిగా ఫెయిల్ అయితే అప్పుడు నాది బాధ్యత. సినిమాలకు అతీతంగా నాకు ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. అది చాలు.. పనిచేసుకుంటూ పోవటమే నాకు తెలుసు. ఇక సక్సెస్ అంటరా.. కాస్త లేటైనా అదే వస్తుంది’ అని చెప్పుకొచ్చింది.