Mallu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఘన స్వాగతం లభించింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 ది రూల్. బ్లాక్ బస్టర్ చిత్రం పుష్పకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుడటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 05 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విడుదలకు ఇంకా 8 రోజులు కూడా లేకపోవడంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ట్రైలర్ లాంఛ్ వేడుకను బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించగా.. ఈ ఈవెంట్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. సుమారు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
ఈ వేడుక అనంతరం చెన్నైలో పుష్ప 2 ఈవెంట్‌ని నిర్వహించగా.. ఇది కూడా భారీ సక్సెస్‌ను సాధించింది. తాజాగా నేడు కేరళలో వేడుకను నిర్వహించగా.. ఈవెంట్ కోసం నేడు కేరళకు వెళ్లాడు అల్లు అర్జున్. అయితే కేరళలో అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మల్లు అర్జున్ కేరళకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా అతడిని చూడడానికి పోటెత్తారు. ఎయిర్‌పోర్ట్‌లో అతడికి ఘన స్వాగతం పలికిన అభిమానులు ఈవెంట్ జరిగే వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Kerala Welcomes Mallu Icon Star Allu Arjun 🔥
Grand Event in Kochi begins soon
Stay tuned to 🔗 https://t.co/kAEFVuJsUT#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika
Massive Events and Promotions by @shreyasgroup pic.twitter.com/7TJmEp9w6Z
— Shreyas Media (@shreyasgroup) November 27, 2024
KERALA WELCOMES MALLU ARJUN 🔥🔥#PushpaRulesKeralam ❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/NPj9CqPQBz
— Pushpa (@PushpaMovie) November 27, 2024
Keralam Welcomes #MalluArjun 🔥
KOCHI WELCOMES ALLUARJUN #AlluArjun 🔥🦁 pic.twitter.com/h23MNMRsiW
— SURYAA🪓 (@SurendraK1447) November 27, 2024