నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సాని కాయిధమ్ (Saani Kaayidham). ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీ రోల్ పోషించిన ఈ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానుందట. తాజా అప్ డేట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ చిత్రం ప్రీమియర్ కానుంది. మార్చి 1 కానీ, రెండో వారంలో కానీ ప్రీమియర్‌పై క్లారిటీ రానుందని ఇన్ సైడ్ టాక్. దీనికి సంబంధించిన మేకర్స్ కూడా అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.
సెల్వ రాఘవన్ కు నటుడిగా ఇది తొలి సినిమా కావడం విశేషం. రాకీ ఫేం అరుణ్ మహేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. సాని కాయిధమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలో కూడా విడుదల కానుంది.