సాధారణంగా కథానాయికలు తమ రిలేషన్షిప్ స్టేటస్ గురించి బహిరంగంగా చెప్పడానికి అంతగా ఇష్టపడరు. ఏదైనా ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు సాధ్యమైనంత వరకు దాటవేసే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టింది.
‘ఇన్నేళ్లు సింగిల్‌గా ఉంటున్నారు. మీకస్సలు బోర్‌గా అనిపించడం లేదా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు..‘నేను సింగిల్‌గా ఉన్నానని మీతో ఎప్పుడైనా చెప్పానా? అంటూ ఎదురు ప్రశ్నించింది. దాంతో ఈ భామ ప్రేమలో ఉందనే నిర్ధారణకు వచ్చారు అభిమానులు. అదే విషయాన్ని పరోక్షంగా చెప్పిందని అనుకుంటున్నారు.
కీర్తి సురేష్ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ముద్దుగుమ్మ మనసుదోచిన కుర్రాడెవరంటూ ఆమె అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇదే ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కీర్తి సురేష్. కెరీర్ ఆరంభంలో వరుస ఫెయిల్యూర్స్‌తో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ‘మహానటి’ చిత్రం తర్వాతే అద్భుతమైన విజయాలు వరించాయని చెప్పింది. కీర్తి సురేష్ తాజా తమిళ చిత్రం ‘రఘు తాత’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది.