Keerthy Suresh New Movie | విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. ఈ సినిమాకు కె. చంద్రు దర్శకత్వం వహిస్తుండగా.. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. కీర్తి సురేశ్ ఈ సినిమాలో ‘రీటా’ అనే సామాన్య మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల కారణంగా ఆమె తుపాకీ (రివాల్వర్) పట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎలాంటి సాహసాలు, సవాళ్లు ఎదుర్కొంది అనేది ప్రధాన కథాంశం. ఇది కామెడీ అంశాలతో కూడిన పక్కా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతుంది.