Keerthy Suresh| తెలుగులో మహానటి సినిమాతో మంచి ఇమేజ్ అందిపుచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్.చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈ భామ టాలీవుడ్ టాప్ హీరోయిన్గా మారింది. అయితే మొదట్లో అందాల ఆరబోతకి గిరిగీసుకుని కూర్చున్న కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచింది. సౌత్‌లో ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పిన ‘మహానటి’ ఉత్తరాదికి వెళ్లే సరికి గ్లామర్ డోర్స్ తెరిచింది. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. ‘బేబీ జాన్’ డిజాస్టర్ బాలీవుడ్ కెరీర్ డైలామాలో పడేట్లుచేసింది. విజయ్ నటించిన తేరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా, ఇందులో వరుణ్ ధావన్ సరసన కీర్తి నటించింది.
భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కీర్తికి బాలీవుడ్లో వరుస అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కా అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. త్వరలో రొమాంటిక్ కామెడీలో నటించనుండగా, దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో రానుంది. అయితే కీర్తి సురేష్ తన కెరీర్లో పెద్ద తప్పే చేసింది. బేబీ జాన్ కోసం బాలీవుడ్లో వచ్చిన పెద్ద ఆఫర్‌ను వదులుకొని చాలా బాధపడింది. గత ఫిబ్రవరిలో విడుదలైన ఛావా సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కథానాయికగా ముందుగా కీర్తి పేరునే అనుకున్నారట. ఆమెని సంప్రదించారట కూడా. అయితే ఆ సమయంలో బేబి జాన్ అవకాశం రావడంతో ఛావా సినిమాను వదులుకుంది.
సినిమా రిలీజ్ తర్వాత తాను ఎంత పెద్ద తప్పు చేసిందనే విషయం అర్ధమైంది కీర్తి సురేష్‌కి. ఈ ముద్దుగుమ్మ వదిలేసుకున్న ఛావా చిత్రం దాదాపు రూ. 700 కోట్లు వసూలు చేయగా, బేబి జాన్ దారుణంగా నిరాశపరిచింది. కీర్తి సురేష్ ఇలాంటి పెద్ద ఆఫర్‌ను వదులుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్ర కోసం త్రిష కంటే ముందు కీర్తి సురేష్‌ను అడగగా, అప్పటికే రజనీకాంత్ నటించిన అన్నాత్తే చిత్రంలో చెల్లెలి పాత్ర రావడంతో పొన్నియన్ సెల్వన్ వదులుకుంది. ఇప్పటికైన కీర్తి సురేష్ కెరీర్లో ఆచితూచి అడుగులు వేయాలి.