Keerthy Suresh | ఇంటర్ చదవుతున్నప్పుడే ప్రేమలో పడిపోయా: కీర్తి సురేష్
ఇటీవల తన చిరకాల మిత్రుడు ఆంటోనీతో కలిసి పెళ్లి పీటలెక్కింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. గోవా వేదికగా వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనితో ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కీర్తి సురేష్.
Keerthy Suresh | ఇటీవల తన చిరకాల మిత్రుడు ఆంటోనీతో కలిసి పెళ్లి పీటలెక్కింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. గోవా వేదికగా వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనితో ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కీర్తి సురేష్. ఇంటర్ చదవుతున్నప్పుడే ఆంటోని ప్రేమలో పడిపోయానని, దాదాపు 15 ఏండ్లుగా తమ ప్రేమాయణం కొనసాగుతున్నదని చెప్పింది.
‘ఆంటోని నాకంటే ఏడేళ్లు పెద్ద. 2010లో తను నాకు తొలిసారి లవ్‌ప్రపోజ్ చేశాడు. అప్పుడే నాకు ప్రామిస్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. దానిని ఇప్పటివరకు తీయలేదు. మేమిద్దరం గత రెండేళ్లుగా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాం. డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టాం. ఆంటోనికి పబ్లిక్‌లైఫ్‌లో కనిపించడం అంతగా ఇష్టం ఉండదు. కాస్త సిగ్గు ఎక్కువ. అందుకే మేమిద్దరం ఎప్పుడూ మీడియా ముందుకురాలేదు. ఆంటోనిలాంటి మంచివాడు నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

