కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Beast)నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు బీస్ట్ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిందే. ఇప్పటికే బీస్ట్ నుంచి అనిరుధ్ కంపోజ్ చేసిన హలమితి హబిబో (Halamithi Habibo) సాంగ్ స్టైలిష్ గా సాగుతూ మ్యూజిక్, డ్యాన్సింగ్ లవర్స్ లో జోష్ నింపుతోంది. ఈ పాట నెట్టింట్లో అందరితో స్టెప్పులు వేయిస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇటీవలే ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అదరహో అనిపించింది. తాజాగా మరో భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh) కూడా ఈ జాబితాలో చేరిపోయింది. హిట్ ట్రాక్‌కు ది రూట్..టాలెంట్ మేనేజర్ అక్షిత సుబ్రమణియన్ తో కలిసి ఇరగదీసే డ్యాన్స్ చేసింది కీర్తిసురేశ్. పంజాబీ డ్రెస్‌లో ఉన్న కీర్తిసురేశ్ తనలోని డ్యాన్స్ స్కిల్‌ను నెటిజన్లకు పర్ఫెక్ట్గా పరిచయం చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.