Keerthy Suresh | మెగాస్టార్ చిరంజీవి డాన్స్‌కు భారత సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అతని స్టెప్పులకు, స్క్రీన్ ఎనర్జీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. చిరంజీవి, దళపతి విజయ్ ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆమె విజయ్ పేరు చెప్పడంతో ముఖ్యంగా మెగా అభిమానులు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వివాదంపై కీర్తి సురేష్ స్పందించారు. తాజాగా ఆమె నటించిన ‘రివాల్వర్ రీటా’ మూవీ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన కీర్తి సురేష్‌ను మీడియా ప్రతినిధులు వివాదంపై ప్రశ్నించగా, ఆమె స్పష్టమైన వివరణ ఇచ్చారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇద్దరూ లెజెండ్స్ . చిరంజీవి గారు మెగాస్టార్ అని కూడా చెప్పాను. దళపతి విజయ్ సార్ తమిళనాడులో లెజెండ్. ఆ ఇంటర్వ్యూలో నా అభిప్రాయం అడిగారు కాబట్టి నేను చూసిన సినిమాల ఆధారంగా విజయ్ గారి పేరు చెప్పాను. అంతే తప్ప చిరంజీవి గారిని ఎప్పుడూ తక్కువ చేయలేదు. అలాగే ఈ విషయం గురించి చిరంజీవితో కూడా మాట్లాడానని ఆమె తెలిపారు. చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు ఆయన నా నిజాయితీని మెచ్చుకున్నారు. అభిమానుల్లో ఎవరికైనా నా మాటల వల్ల హర్ట్ అయితే నిజంగా క్షమించండి” అని కీర్తి అన్నారు.
నవంబర్ 28న విడుదల కానున్న డార్క్ కామెడీ ‘రివాల్వర్ రీటా’ లో కీర్తి సురేష్ లీడ్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ ..సునీల్ గారు చాలా డిఫరెంట్ రోల్ చేశారు, రాధిక శరత్‌కుమార్ గారితో నా కెమిస్ట్రీ ఆడియన్స్‌కి చాలా నచ్చుతుంది. ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ. హీరోయిన్ లీడ్‌లో వచ్చే డార్క్ కామెడీ సినిమాలు అరుదు… ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని పేర్కొంది. కొన్నాళ్లుగా కీర్తికి సక్సెస్‌లు రావడం లేదు.ఈ మూవీతో అయిన మంచి హిట్ అంది పుచ్చుకుంటుందా అనేది చూడాలి.