Keerthy Suresh – Turkish Icecream | టర్కిష్ ఐస్‌క్రీమ్ వెండర్లు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియాలో ప్రతి షాపింగ్ మాల్లో లేదా మెట్రో సీటీలలోని విధులలో కనిపిస్తుంటారు. కేవలం ఐస్‌క్రీమ్ అమ్మడం మాత్రమే కాదు, కస్టమర్లతో ఐస్‌క్రీమ్ ఇవ్వకుండా ఒక ఆట ఆడుకుంటారు. ఐస్‌క్రీమ్ కోన్‌ను కస్టమర్‌కు ఇచ్చేలా చేసి, చివరి క్షణంలో దాన్ని తిరిగి లాగేసుకుంటారు. ఐస్‌క్రీమ్‌ను పైకి ఎత్తడం, తిప్పడం, లేదా కోన్‌ను ఖాళీగా ఇచ్చి ఆశ్చర్యపరచడం వంటివి చాలా వరకు వీడియోలలో చూసే ఉంటాము. అయితే టర్కిష్ ఐస్‌క్రీమ్ తిందాం అని షాప్‌కి వెళ్లిన స్టార్ నటి కీర్తి సురేష్‌ని చాలాసేపు ఆటపట్టించాడు ఒక ఐస్‌క్రీమ్ వెండర్.
ఐస్‌క్రీమ్ ఇచ్చినట్లే ఇచ్చి తీసుకోవడం. మళ్లీ కోన్ కీర్తి సురేశ్ చేతిలో పెట్టడం చేశాడు. చివరగా కీర్తి చేతిలో ఐస్‌క్రీమ్ పెట్టాడు. అయితే ఐస్‌క్రీమ్ ఇచ్చిన అనంతరం అసలు ఆటను చూపించింది కీర్తి సురేష్. తన వద్ద ఉన్న డబ్బులను తీసుకోమంటూ వాళ్లు వాడిన ట్రిక్ వారిమీదే ప్రయోగించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Keerthy Suresh flips the script! 🍦😂 When the ice cream vendor trolls, but she trolls right back! @KeerthyOfficial#KeerthySuresh #ReverseUno #IceCreamWars #siima pic.twitter.com/f65oE7Z1Zq
— SIIMA (@siima) March 20, 2025