‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా అవతరించింది కీర్తి సురేశ్. తను ఎన్ని భాషల్లో నటించినా.. ఆమె కెరీర్‌కి మేలి మలుపు మాత్రం తెలుగు సినిమానే . ‘దసరా’ తర్వాత తెలుగులో ఆమె హీరోయిన్గా నటించలేదు. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగు సినిమాలకు వరుసపెట్టి సైన్ చేస్తున్నారు కీర్తి సురేశ్. ‘బలగం’ఫేం వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించనున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కథానాయికగా ముందు సాయిపల్లవిని అనుకున్నారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సాయిపల్లవి ‘ఎల్లమ్మ’కు ఓకే చెప్పలేకపోయింది. దాంతో ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌లోకి కీర్తి సురేశ్ ఎంటరయ్యారన్న వార్త ప్రస్తుతం విస్తృతంగా వినిపిస్తున్నది. దీనితోపాటు మరో ప్రతిష్టాత్మక చిత్రంలో కూడా కీర్తి కథానాయికగా ఎంపికైందట. అది కూడా దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమానే కావడం విశేషం. అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణీవారు’ఫేం రవికిరణ్ కోలా ఈ సినిమా తెరకెక్కించనున్నారు. సినిమా పేరు ‘రౌడీ జనార్థన్’. ఏదేమైనా.. పెళ్లయ్యాక తెలుగు తెరకి దూరమైన కీర్తి.. మళ్లీ నిదానంగా టాలీవుడ్‌కి చేరువ కానున్నదన్నమాట.