Keeda-Cola Movie | వంద రోజుల ముందు రిలీజైన కీడాకోలా టీజర్‌కు ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్టైన్ చేయలేదు. పెద్దగా స్టోరీ గురించి రివీల్ చేయలేదు కానీ.. తరుణ్ భాస్కర్ టేకింగ్ స్టైల్ అయితే కనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై వీర లెవల్లో హైప్ ఏర్పడింది. ఓ బొద్దింకను, కోలా క్యాప్‌ను చూపించి కీడా కోలా అంటూ వినూత్న టైటిల్ పెట్టి మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాడు. పైగా బ్రహ్మనందంను కీలకపాత్రలో పెట్టి సినిమా తీయడంతో అందరిలోనూ తెలియని ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.
ఓ వైపు టురెట్ సిండ్రోమ్ అనే వింత జబ్బుతో బాధపడే ఓ వ్యక్తి కోట్లు విలువ చేసే బొమ్మను కోటీలో కూడా కొనుక్కోడానికి వీలులేకుండా చేస్తాడు. దానిపై కోర్టులో వాదన జరుగుతుంది. మరోవైపు తనవల్లే రాజన్న కార్పోరేటర్ అయ్యాడని విర్ర వీగుతున్న జీవన్ పొగరు దింపడానికి కార్పోరేటర్ ఓ వింత చేష్ట చేస్తాడు . అది చూసి హర్ట్ అయిన జీవన్.. తనకు బాగా కావాల్సిన వ్యక్తి నాయుడు అలీయాస్ తరుణ్ భాస్కర్‌తో కలిసి రాజన్నను ఖతం చేసి కార్పోరేటర్ అవ్వాలని ప్లాన్ చేస్తాడు. అదే టైమ్‌లో మరో గ్యాంగ్ కోట్లు విలువ చేసే బొమ్మను దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా రెడీ అవుతారు. ఇక ట్రైలర్ చివర్లో బొమ్మ చుట్టూ జరిగే వయోలెన్స్‌ను ఫన్నీ యాంగిల్లో చూపించారు.
మొత్తంగా ట్రైలర్ ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. తరుణ్ సినిమా స్టోరీపై పెద్దగా క్లారిటీ ఇవ్వకుండా కాస్త కన్ఫ్యూజన్లో పెట్టాడు. అసలు బొమ్మ చుట్టూ అంత రచ్చ ఎందుకు జరుగుతుంది.. అసలు ఆ బొమ్మ కథ ఏంటి.. ఆ బొమ్మలో ఏముంది అనే పలు రకాలు ప్రశ్నలను ట్రైలర్‌తో లేవదీశాడు. అంతేకాకుండా ట్రైలర్ మొదట్లో కోలాలో పడి కొట్టుకుంటున్న బొద్దింక షాట్‌ను చూపించారు. ఇది కూడా సినిమాలో కీలకం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక వీటన్నిపై క్లారిటీ రావాలంటే మరో రెండు వారాలు వేచి చూడాల్సింది. నవంబర్ 3న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే కావాల్సిన హైప్ ఉంది. ఇక ట్రైలర్‌తో ఆ హైప్ ఎలాగో మరింత పెరుగుతుంది. ఎలాగో సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది గనుక థియేటర్ల సమస్య ఉండదు. కథలో కాస్త కొత్తదనంతో పాటూ తరుణ్ మార్క్ ఉంటే మట్టుకు సాలిడ్ ఓపెనింగ్స్ రావడం పక్కా.