Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) చిత్రాల ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ఐదేండ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ భాస్కర్ ఈ సినిమా తీయగా.. తొలి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది. గ్లోబల్‌గా, దేశీయంగా కలెక్షన్ల వర్షం కురిసింది.
ఇక ‘కీడా కోలా’ (Keedaa Cola) సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్లు చూసుకుంటే.. రూ.6.03 కోట్లు వసూలైనట్టు వివిధ రిపోర్టులు చెబుతున్నాయి. రానున్న రెండు రోజులు వీకెండ్ కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు శుక్రవారం రోజే విడుదలైన సత్యం రాజేష్ ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా తొలిరోజు రూ. 3 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
Both films are doing well at box office for their budget and genre! 👍#KeedaaCola#Polimera2 pic.twitter.com/PrmPp6zkU5
— idlebrain jeevi (@idlebrainjeevi) November 4, 2023
ఇక ‘కీడా కోలా’ సినిమా కథ విషయానికి వస్తే..
వాస్తు(చైతన్యరావు) అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. అందులోంచి బయటపడాలంటే డబ్బు అవసరం. జీవన్(జీవన్‌కుమార్).. అనుకోకుండా అవమానాలపాలవుతాడు. ప్రతీకారం తీరాలంటే అతను కార్పొరేటర్ కావాలి. దానికీ డబ్బే అవసరం. వాస్తు తన తాత వరదరాజులు(బ్రహ్మానందం)కోసం తెచ్చిన శీతలపానీయంలో బొద్దంక కనిపిస్తుంది. ఎలాగూ డబ్బు అవసరం కాబట్టి.. దీన్నే అదనుగా తీసుకొని, లీగల్‌గా ప్రొసీడవుతామని సదరు శీలత పానీయం కంపెనీవారిని బెదిరించి డబ్బుగుంజుదామని వాస్తు మిత్రుడు, న్యాయవాది అయిన కౌశిక్(రాగ్‌మయూర్) సలహా ఇవ్వడంతో అసలు కథ మొదలవుఉంది. ఇక జీవన్ విషయానికొస్తే.. తన అన్న నాయుడు(తరుణ్‌భాస్కర్) జైలునుండి విడుదలవ్వడంతో.. అన్న అండతో ఎలాగైనా కారొరేటర్ అవుదామని ఆశపడతాడు. కానీ దానికి కూడా డబ్బే అవసరం కావడంతో వాళ్లు ఓ పన్నాగం పన్నుతారు. ఇంతకీ జీవన్ అండ్ బ్యాచ్ పన్నిన పన్నాగం ఏంటి? శీతలపానీయం కంపెనీవాళ్లను బెదిరించి వాస్తు అండ్ బ్యాచ్ డబ్బులు కొట్టేయగలిగారా? వాస్తు, జీవన్‌లు డబ్బులు సంపాదించగలిగారా? అసలు ఆ ‘కీడాకోలా’ బొద్దంకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలినకథ.
క్రైం కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను వీజీ సైన్మా బ్యానర్‌పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్, రాగ్‌మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.