Kavya Thapar | “విశ్వం’ సినిమాలో అన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఛాలెంజ్‌గా తీసుకొని ఈ పాత్ర చేశాను. శ్రీనువైట్ల డైరెక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది. నా పాత్రని చాలాస్టైలిష్ గా డిజైన్ చేశారాయన. ఆయన డెడికేషన్‌కి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమాలో చాలా పాత్రలుంటాయి. అందరినీ మోటివేట్ చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. శ్రీనువైట్ల వల్లే ఈ సినిమాలో బాగా నటించగలిగాను. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది.’ అని కథానాయిక కావ్య థాపర్ అన్నారు. గోపీచంద్ సరసన ఆమె నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయా స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా కావ్య ఆదివారం విలేకరులతో ముచ్చటించింది. ‘ ముందుగా ఈ సినిమాను చిత్రాలయా బ్యానర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భాగం అయ్యింది. దాంతో సినిమా రేంజ్ పెరిగింది. నిర్మాణ విలువలు చాలా హైప్లో ఉంటాయి. రేపు థియేటర్లో మీరే చూస్తారు.’ అని తెలిపింది కావ్య థాపర్. ‘గోపీచంద్ చాలా కామ్ గోయింగ్. సెట్లో తన పనేదో తాను చేసుకుంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. హిమాచల్, మనాలి వంటి ప్రాంతాల్లో వర్క్ చేయడం చాలా కష్టం. యూనిట్ సహకారంతో అక్కడి షూటింగ్ పూర్తి చేయగలిగాం. నటిగా నాకు గొప్ప అనుభూతి కలిగించిన సినిమా ‘విశ్వం’ ’ అని కావ్యాథాపర్ చెప్పారు.