Kiss Movie | దాదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ నటుడు కవిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కిస్’. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహించడంతో పాటు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తుంటే.. కవిన్ ఇందులో ప్రేమ, రొమాన్స్, ముఖ్యంగా ముద్దు (కిస్) అంటే అస్సలు ఇష్టపడని యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. తనకు గతంలో ఎదురైన అనుభవాలతో సతమవుతున్న అతడికి ప్రీతీ అనే అమ్మాయి లైఫ్‌లోకి వచ్చిన అనంతరం ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.