Kaun Banega Crorepati | ఇండియాలో మోస్ట్ పాపులర్‌గా నిలిచిన రియాలిటీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కొత్త సీజన్‌తో తిరిగి రాబోతోంది. ఇప్పటికే 16 సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో తాజాగా కొత్త సీజన్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది. ఈ సందర్భంగా కొత్త సీజన్‌కి సంబంధించిన ప్రోమోను సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ విడుదల చేసింది. ఎప్పటిలాగే, ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ కొత్త సీజన్ ఆగస్టు 11వ తేదీ ప్రారంభం అవుతుండగా.. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ మరియు సోనీ LIVలో ప్రసారం కానుంది. మరోవైపు ఈ ఏడాది ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకుంది. జూలై 3, 2000న ప్రారంభమైన ఈ షో ఇటీవలే 25 ఏండ్లు పూర్తి చేసుకుంది.