ముంబై : రెస్టారెంట్స్‌లో అడపాదడపా ఇష్టమైన వంటకాను లాగించినా రోజంతా పనితో అలసిపోయిన తర్వాత ఇంట్లో చేసిన ఆహార పదార్ధాలనే తినాలని అనిపిస్తుంటుంది. దేశీ రుచులను హోం ఫుడ్ రూపంలో తీసుకుంటే ఆ రుచే వేరని చెబుతుంటారు. మన ఫేవరెట్ సెలబ్రిటీలు (Katrina Kaif) ఇదే రకంగా ఆలోచిస్తుంటారు. కంఫర్ట్ ఫుడ్స్‌కే వారు ఓటేస్తున్నారు.
ఇక టాలీవుడ్ మల్లీశ్వరి కత్రినా కైఫ్ కూడా తనకు హోంమేడ్ ఫుడ్ అంటే ఇష్టమని చెబుతున్నారు. ఈ భామ ఇటీవల తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్ నిర్వహించగా ఓ అభిమాని ఆమెకు ఇష్టమైన ఆహారం గురించి అడిగారు. ఆ ప్రశ్నకు కత్రినా బదులిస్తూ తన డైనింగ్ టేబుల్‌పై ఉన్న మూడు బౌల్స్‌తో కూడిన ఫొటోను పోస్ట్ చేశారు.
ఈ మూడు బౌల్స్‌లో రెండు సింపుల్ సబ్జీ ప్రిపరేషన్ కాగా, మూడవది థిక్ సూప్. ఇక తనకు ఇష్టమైన ఫుడ్ పొట్లకాయ సబ్జీ, కాలీఫ్లవర్ సబ్జీ, బ్రకోలి సూప్ అంటూ కత్రినా కైఫ్ రాసుకొచ్చారు. ఇక తన భర్త, నటుడు విక్కీ కౌశల్‌తో రొమాంటిక్ బ్రేక్‌ఫాస్ట్ డేట్‌తో పాటు లంచ్, డిన్నర్లను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలనూ ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.
Read More :