Tea VS Coffee | దంతాల ఆరోగ్యానికి కాఫీ, టీ..రెండింటిలో ఏది బెటర్..!
మనలో చాలా మందికి కాఫీ, టీ (Tea VS Coffee) తాగనిదే రోజు ప్రారంభం కాదు. కాఫీ, టీలు మన దైనందిన జీవితంలో అంతర్భాగం కావడంతో పాటు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.
న్యూఢిల్లీ : మనలో చాలా మందికి కాఫీ, టీ (Tea VS Coffee) తాగనిదే రోజు ప్రారంభం కాదు. కాఫీ, టీలు మన దైనందిన జీవితంలో అంతర్భాగం కావడంతో పాటు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అయితే నోటి ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే కాఫీ, టీలతో కొన్ని జాగ్రత్తలు తప్పవు. దీర్ఘకాలం కాఫీ, టీలు అధికంగా తీసుకుంటే దంతాలపై మరకలు రావడం గమనించవచ్చు. డార్క్ కలర్లో ఉండే కాఫీతో దంతాలపై మరకలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక కాఫీతో పోలిస్తే టీలో మరకలు ఏర్పరిచే గుణం తక్కువగా ఉంటుంది.
ఇక రోజుకు ఎన్నిసార్లు టీ, కాఫీలు తాగుతున్నాము, నోటి పరిశుభ్రత వంటి అంశాలపైనా పంటిపై మరకలు ఏర్పడటం అనేది ఆధారపడిఉంటుంది. ఇక దీర్ఘకాలంగా కాఫీ, టీలు తాగే వారిలో పంటి ఎనామిల్ బలహీనపడే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఆమ్లాలు ఉండే క్రమంలో దంతక్షయం, సెన్సిటివిటీ సమస్యలు తలెత్తుతాయి. టీతో పోలిస్తే కాఫీలో తక్కువ పీహెచ్ ఉండటంతో ఇది అసిడిటీని అధికంగా ప్రేరేపిస్తుంది. ఈరకంగా కాఫీతో పోలిస్తే టీ ఎనామిల్‌ను పెద్దగా దెబ్బతీయదు. కాఫీ, టీల్లో షుగర్లను అధికంగా జోడిస్తే ఆ మేరకు అసిడిటీ లెవెల్స్ పెరుగుతాయి. దంత ఆరోగ్యం గురించి ఆలోచించే వారు అధికంగా చక్కెర, ఇతర ఫ్లేవర్లను జోడించడం మంచిది కాదు.
కాఫీ, టీల్లో ఉండే కేఫిన్ నోటి పరిశుభ్రతను పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఇది నోరు పొడిబారేలా చేస్తుంది. నోటిలో ఆమ్లాలను బ్యాలెన్స్ చేసే సలీవాను కేఫిన్ తగ్గిస్తుంది. కాఫీ లేదా టీ ఏది తీసుకున్న కొన్ని జాగ్రత్తలతో నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నోటి పరిశుభ్రతను కాపాడుకునేందుకు రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. కాఫీ, టీల్లో అధికంగా చక్కెర వాడకాన్ని నివారించాలి. దంతాలపై మరకలు ఏర్పడకుండా, ఎనామిల్ దెబ్బతినకుండా ఉండేందుకు టీ, కాఫీలను పరిమితంగా తీసుకోవాలి. టీ, కాఫీలను సేవించిన తర్వాత నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తరచూ వైద్యుడిని సంప్రదిస్తూ డెంటల్ చెకప్స్ చేయించుకోవాలి.
Read More :
Mohammed Shami’s Wife: మంచి మనసున్నోళ్లే గెలుస్తారు..! మళ్లీ నోరు పారేసుకున్న షమీ మాజీ భార్య..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

