Katrina Kaif | బాలీవుడ్లో తారల దుస్తుల ఎంపిక నుంచే వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయడం ఈ మధ్య కామన్ అయింది. తాజాగా నటి కత్రినా కైఫ్ వేసుకున్న లూజ్ చొక్కా తన బేబి బంప్‌ని కవర్ చేసేందుకే అని, త్వరలోనే ఆమె తల్లి కాబోతోందన్న రూమర్లు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరైనా సెలబ్రిటీ లూజ్ టాప్, ట్రాక్ ప్యాంట్ వంటి రీలాక్స్డ్ డ్రెస్సింగ్ స్టైల్లో బయటకు వస్తే, వెంటనే అనేక ఊహాగానాలు వెల్లువెత్తుంటాయి. ఇప్పుడు అదే ముద్ర కత్రినా మీద కూడా పడింది. ఇటీవల ఆమె భర్త విక్కీ కౌశల్‌తో కలిసి ముంబై ఫెర్రీ పోర్ట్ వద్ద కనిపించిన వీడియోలో కత్రినా లూజ్ వైట్ షర్ట్‌తో కనిపించడంతో మరోసారి గాసిప్స్ మొదలయ్యాయి.
2025 ప్రారంభం నుంచే కత్రినా ప్రెగ్నెన్సీపై రూమర్లు వినిపిస్తున్నాయి. ఆమె-విక్కీ విహారయాత్రలో ఉన్నపుడే మొదలైన ఈ ఊహాగానాలకు తాజాగా వైరల్ అయిన ఓ వీడియో మళ్లీ ఆ గాసిప్స్‌కు ఊతమిచ్చింది. కత్రినా వేసుకున్న వైట్ పాల్కా డాట్ డ్రెస్‌ని చూస్తే అనుష్క శర్మ గర్భవతిగా ఉన్నప్పుడు వేసుకున్న స్టైల్ గుర్తొస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా విక్కీ-కత్రినా కారు నుండి దిగి ఫెర్రీ వైపు నడుస్తున్న క్లిప్‌లో, కత్రినా వేసుకున్న లూజ్ ఫిట్ చొక్కా చూసి మళ్లీ అదే ‘ప్రెగ్నెన్సీ గాసిప్’ మొదలైంది. అలీబాగ్‌కి ఎందుకు వెళ్లారు? అక్కడే ఏమన్నా స్పెషల్ ప్లాన్ ఉందా? అనే కోణంలో ఆలోచనలు మొదలు పెట్టారు
విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ జంట వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా, హాయిగా జీవిస్తుంది. పండుగలు, ఫ్యామిలీ ఈవెంట్లలో కలిసి కనిపిస్తూ, ఒకరిపై ప్రేమను బహిరంగంగానే చూపిస్తూ ఉంటారు. విక్కీ కుటుంబంతో కత్రినా కలిసిపోయిన తీరు అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది. విక్కీ కౌశల్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. `చావా` సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించగా, ఇప్పుడు `లవ్ అండ్ వార్`, `మహావతార్` వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. కత్రినా ‘మెర్రీ క్రిస్మస్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు కానీ, ఆమె కూడా కెరీర్‌ను ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది.