సినీ కెరీర్లో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది బాలీవుడ్ తార కత్రినా కైఫ్. కేవలం ఒకే ఒక షాట్ చిత్రీకరణ తర్వాత తనను ‘సాయా’ అనే సినిమా నుంచి తొలగించారని కత్రినా గుర్తు చేసుకుంది. కత్రినా మాట్లాడుతూ…‘నా కెరీర్ తొలిరోజుల్లో ‘సాయా’ అనే చిత్రంలో నటించాను. ఒక షాట్ చిత్రీకరణ తర్వాత సినిమా నుంచి తొలగించారు. నటికి ఉండాల్సిన ఒక్క మంచి లక్షణం కూడా నాలో లేదన్నారు. ఆ రోజుతో నా కెరీర్ ముగిసిందని బాధపడ్డా. అయితే ఈ అవమానాల మధ్య నటిని కావాలన్న లక్ష్యాన్ని వదులుకోలేదు. తిరస్కారాలు తట్టుకుని నిలబడ్డా కాబట్టే దాదాపు రెండు దశాబ్దాల నట ప్రస్థానం సాగిస్తున్నా’ అని చెప్పింది.