Balagam National Award | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన బలగం సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ అనే పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ జాతీయ అవార్డు అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించింది. ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు.