Bedurulanka 2012 | బెదురులంక 2012 అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కార్తికేయ
ఇప్పటికే విడుదల చేసిన బెదురులంక 2012 (Bedurulanka2012) ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.
కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న తాజా చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇవాళ పూజాకార్యక్రమాలతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు మేకర్స్. స్టూడియోలో కార్తికేయ డబ్బింగ్ చెబుతున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గోదావరి బ్యాక్ డ్రాప్లో సాగే కథ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని ఈ మూవీలో కీ రోల్స్ చేస్తున్నారు.
ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు కార్తికేయ. చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో బెదురులంక 2012 సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు కార్తికేయ.
డబ్బింగ్ పనుల పూజా కార్యక్రమం.. స్టిల్స్
Time for some 'fun'tastic dubbing !! 🥳
Dubbing for @ActorKartikeya's #Bedurulanka2012 begins with an auspicious pooja💫
More updates soon!!🌊@iamnehashetty #Clax @Benny_Muppaneni #ManiSharma @Loukyaoffl @SonyMusicSouth @Ticket_Factory @PulagamOfficial pic.twitter.com/26T8XapHcT
— BA Raju's Team (@baraju_SuperHit) December 12, 2022
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

