‘యానిమల్’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది త్రిప్తి డిమ్రి. ప్రస్తుతం ఆమెకు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అద్భుతమైన అవకాశం ఈ ముద్దుగుమ్మని వరించినట్టు బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్లో ‘ఆషికీ’ ఫ్రాంచైజీని ఇష్టపడని వాళ్లు ఉండరు.
త్వరలో ‘ఆషికీ 3’ రానున్నదని టాక్. అందులో కథానాయికగా త్రిప్తి డిమ్రి ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన పాత్ర త్రిప్తిని వరించిందట. ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తున్నది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఇవిగాక తెలుగులో తారక్, రవితేజల సరసన కూడా త్రిప్తి నటించనున్నది తెలిసింది.