Sreeleela | అచ్చ తెలుగందం శ్రీలీల పేరు ఇప్పుడు హిందీ చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది. బాలీవుడ్లో తొలి చిత్రం విడుదల కాకముందే ఈ భామ ముంబయి ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నది. అందుక్కారణం హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఈ అమ్మడి లవ్ ఎఫైర్ గురించి విస్తృతంగా ప్రచారం అవుతున్న వార్తలే. బాలీవుడ్ అరంగేట్ర చిత్రంలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తున్నది శ్రీలీల. అనురాగ్‌బసు దర్శకుడు. ఈ చిత్రానికి ‘ఆషికీ-3’ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా ఆ టైటిల్‌కు అనుమతి లభించలేదని తెలిసింది. ఇదిలావుండగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల ప్రేమలో పడ్డారని, కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ పార్టీకి శ్రీలీలను ప్రత్యేకంగా ఆహ్వానించారని, ఈ జంట గుట్టుగా ప్రేమాయణం సాగిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి.
‘ఓ డాక్టర్ మా ఇంటికి కోడలిగా రావాలనుకుంటున్నాం’ అంటూ ఇటీవల ఓ అవార్డుల వేడుకలో కార్తీక్ ఆర్యన్ తల్లి వ్యాఖ్యానించడంతో ఈ జంట లవ్ ఎఫైర్‌కు మరింత బలం చేకూరినట్లయింది. కార్తీక్ ఆర్యన్-శ్రీలీల నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో జరుగుతున్నది. అక్కడి కాఫీ తోటల్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలతో కలిసి ఉన్న ఓ ఫొటోను కార్తీక్ ఆర్యన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ‘తూ మేరీ జిందగీ’ (నువ్వే నా ప్రపంచం) అంటూ సినిమాలోని ఓ పాట తాలూకు పల్లవిని క్యాప్షన్‌గా పెట్టారు. ఈ ఫొటోలో శ్రీలీల వైపు ఆరాధనాపూర్వకంగా చూస్తూ కనిపిస్తున్నారు కార్తీక్ ఆర్యన్. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బలంగా ఉందో ఈ ఫొటో చూస్తే అర్థమవుతున్నదని, కార్తీక్ ఆర్యన్ తన మనసులోని మాటలు క్యాప్షన్ ద్వారా బయటపెట్టాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ జంట ప్రేమ వ్యవహారంలో నిజమెంతుందో తెలియదు కానీ.. తొలి సినిమాతోనే బాలీవుడ్లో శ్రీలీల పేరు మార్మోగిపోతున్నదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.