థియేటర్లోనే చూడాల్సినచిత్రమిది
నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ 2’. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్నది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో సినిమా విశేషాలను చిత్రబృందం తెలిపారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ…‘ఒక కాన్సెప్ట్‌ను నమ్మి సినిమా చేశాం. మంచి చిత్రాన్ని రూపొందించామని భావిస్తున్నాం. సినిమా వర్క్ పూర్తయింది. ఇక దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అన్నారు.
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ…‘ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మాకొక సాహసయాత్రకు వెళ్లిన అనుభూతి కలిగింది. థియేటర్లో చూస్తున్నప్పుడు మీకూ అలాగే అనిపిస్తుందని చెప్పగలను. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆస్వాదించే కంటెంట్ సినిమాలో ఉంది’ అని చెప్పింది. హీరో నిఖిల్ మాట్లాడుతూ…‘థియేటర్ అనుభవాన్ని అందించే సినిమాలు చేస్తే ప్రేక్షకులు హాల్స్‌కు వచ్చి చూస్తారు. ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేసిందే. రెండుసార్లు పాండమిక్ వల్ల ఇబ్బందులు పడ్డాం. అయినా అందమైన లొకేషన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, మంచి కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందించాం. మా చిత్రబృందాన్ని నిర్మాతలు పూర్తిగా నమ్మి సపోర్ట్ చేశారు. బాగున్న సినిమాలు ఎప్పుడు విడుదలైనా ఆదరిస్తారని అనుకుంటున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, నటులు శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, హర్ష తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

