Karthikeya-2 | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కార్తికేయ-2’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Karthikeya-2 Movie On Ott | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో కార్తికేయ-2 ఒకటి. ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు 12న విడుదలై ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. పోటీగా నితిన్ సినిమా ఉన్నప్పటికి ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
Karthikeya-2 Movie On Ott | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో కార్తికేయ-2 ఒకటి. ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు 12న విడుదలై ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. పోటీగా నితిన్ సినిమా ఉన్నప్పటికి ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై ఘన విజయం సాధించింది. బహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాతో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.120కోట్ల వరకు కలెక్షన్లు సాధించి కంటెంట్ ఉన్న సినిమాలకు అడ్డేది అని నిరూపించింది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో కార్తికేయ-2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చింది.
కార్తికేయ-2 చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ జీ సంస్థ ప్రకటించింది. అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. కాగా ఈ సినిమా మలయాళ వెర్షన్ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలలో అత్యధిక ప్రాఫిట్స్ వచ్చిన రెండో సినిమాగా కార్తికేయ-2 నిలిచింది.
Read Also:
Ponniyin Selvan-1 | ‘పొన్నియన్ సెల్వన్’ నటులకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరికి అన్ని కోట్లా?
Jr. Ntr | రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ?
Ranga Ranga Vaibhavanga | ఓటీటీలోకి వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Raja Delux Movie | ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

