Ranga Ranga Vaibhavanga | ఓటీటీలోకి వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ranga Ranga Vaibhavanga Movie On OTT | 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌తేజ్.. అదే జోష్‌ను తరువాతి సినిమాల్లో కంటీన్యూ చేయలేకపోతున్నాడు. గతేడాది విడుదలైన 'కొండపోలం' మూవీ.. అసలు వచ్చిందన్న విషయమే సగం మందికి తెలియకుండా వెళ్లిపోయింది.
Ranga Ranga Vaibhavanga Movie On OTT | ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌తేజ్.. అదే జోష్‌ను తరువాతి సినిమాల్లో కంటీన్యూ చేయలేకపోతున్నాడు. గతేడాది విడుదలైన ‘కొండపోలం’ మూవీ.. అసలు వచ్చిందన్న విషయమే సగం మందికి తెలియకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఈ సారి ఎలాగైన హిట్ సాధించాలని ‘రంగ రంగ వైభవంగా’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేక వైష్ణవ్ కెరీర్లో వరుసగా రెండో ఫేయిల్యూర్‌గా మిగిలింది. కథ, కథనం రోటీన్‌గా ఉండటంతో ప్రేక్షకులకు ఈ చిత్రం రుచించలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5 లేదా అక్టోబర్ 7న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ డేట్‌పై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. నవీన్ చంద్ర కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
Read also:
Ram Setu Movie | ఆసక్తి రేకిత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్ సేతు’ గ్లింప్స్..!
Allu Sirish | అల్లు శిరీష్ కొత్త సినిమా టీజర్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Raja Delux Movie | ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో?
Ananya Pandey | ఓటీటీలోకి ‘లైగర్’ భామ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

