Jr. Ntr Movie Re-Release | జూ.ఎన్టీఆర్ కెరీర్లో ‘ఆది’ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి వరకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు.. ఆది చిత్రం స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. 19ఏళ్ళకే ఎన్టీఆర్ ఈ చిత్రంతో రికార్డులు తిరగరాసాడు. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. 118 సెంటర్లలో రిలీజైన ఈ సినిమా 96 సెంటర్లలో 100రోజులు ఆడి రికార్డు సృష్టించింది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని రెండు కోట్లతో నిర్మించాడు. ఫైనల్‌గా ఈ చిత్రం 19కోట్ల షేర్‌ను కలెక్ట్ బయ్యర్లకు పదింతలు ప్రాఫిట్స్ను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం రీ-రిలీజ్‌కు సిద్ధమైవుతుంది.
ఈ మధ్య టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఆది’ చిత్రం 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా వెల్లడించాడు. ఇప్పటికే ‘పోకిరీ’, ‘జల్సా’, ‘చెన్నకేశవ రెడ్డి’ వంటి సినిమాలు రీ-రిలీజ్ అయి రికార్డ్ కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆది చిత్రాన్ని వీలైనంత త్వరగా 4కే ప్రింట్ సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు.
Read Also:
jawan Movie | భారీ ధరకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా
Raja Delux Movie | ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో?
Ram Setu Movie | ఆసక్తి రేకిత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్ సేతు’ గ్లింప్స్..!
Allu Sirish | అల్లు శిరీష్ కొత్త సినిమా టీజర్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?