నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ 2’. అనుపమా పరమేశ్వన్ నాయికగా నటిస్తున్నది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ‘సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం ఈ ద్వారకా నగరం..’ అంటూ మొదలైన మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా సాగింది. ద్వారకా నగర రహస్యాన్ని తెలుసుకునేందుకు డాక్టర్ కార్తికేయ అనే యువకుడు, తన ప్రేయసి ముగ్ధ, మిత్రులతో చేసిన ప్రయాణం ఎలా సాగింది అనేది సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది.