Ajith Kumar 64 | తమిళ నటుడు అజిత్ ప్రస్తుతం ఫుల్ జోష్‌తో ఉన్నాడు. ఒకవైపు ఆయన నటించిన పట్టుదల (విడాముయర్చి) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లో సందడి చేస్తుండగా.. మరోవైపు దుబాయ్‌లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ టీం ముడో స్థానంలో నిలిచింది. అయితే అజిత్ ప్రస్తుతం ప్యూచర్లో జరుగబోతున్న రేసింగ్ పోటీలకోసం సిద్ధమవుతున్నాడు. ఇదిలావుంటే తస అప్‌కమింగ్ ప్రాజెక్ట్ AK64కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అజిత్ కుమార్ తన 64 ప్రాజెక్ట్‌ను తమిళ స్టార్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ ఇప్పటికే అజిత్‌ను కలిసి స్టోరీ లైన్ చెప్పినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అజిత్ తన 64వ చిత్రాన్ని నితిలన్ స్వామినాథన్‌తో పాటు ప్రశాంత్ నీల్, విష్ణువర్ధన్, వెంకట్ ప్రభు వంటి డైరెక్టర్లతో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏ కాంబో ఇంకా సెట్ అవ్వలేదు. అజిత్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తుండగా.. కార్తీక్ ప్రస్తుతం సూర్యతో రెట్రో అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.