karthik Rathnam | విభిన్న పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు కార్తీక్ రత్నం. ‘కేరాఫ్ కంచెరపాలం’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తిక్ రత్నం మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శనివారం ఈయన నిచితార్థం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్న కార్తీక్ రత్నం సినిమాలపై ఉన్న మక్కువతో ఆ కోర్సును మధ్యలోనే వదిలేసి ‘కేరాఫ్ కంచెరపాలం’ సినిమాలో నటించాడు. ఆ తర్వాత జీ5 సంస్థ తెరకెక్కించిన ‘గాడ్ ఆఫ్ ధర్మపురి’ వెబ్ సిరీస్‌తో నిడివి ఎక్కువ ఉన్న పాత్రలో నటించాడు. ‘అర్థ శతాబ్ధం’, ‘నారప్ప’ సినిమాలలో తన నటనకు ప్రేక్షకుల నుంచి సినీ క్రిటిక్స్ వరకు మంచి ప్రశంసలు దక్కాయి. లేటెస్ట్గా ఈయన ‘రౌడిబాయ్స్’ సినిమాలో ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా నటించాడు.
Photos : Actor #KarthikRathnam ties the knot#123teluguhttps://t.co/8dxiRRrVFc pic.twitter.com/FzQrRmA69S
— 123telugu (@123telugu) March 5, 2022